MI vs RR : పంతొమ్మిదో సీజన్ ప్లే ఆఫ్స్ చివరి బెర్తును రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పట్టేసింది. ఉత్కంఠ పోరులో అదిరే ఆటతో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు చెక్ పెట్టిన రాజస్థాన్.. ఎలిమినేటర్ ఆడాలనుకున్న పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. వాంఖడేలో జోఫ్రా ఆర్చర్(32, 3-17) ఆల్‌రౌండ్ షోతో ముంబై బెంబేలెత్తిపోయింది. భారీ ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(60) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను రాజస్థాన్ ఢీకొట్టనుంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టి కృషితో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గెలిస్తేనే ఎలిమినేటర్ బెర్తు దక్కనున్న వేళ జోఫ్రా ఆర్చర్(32, 3-17) చెలరేగాడు.వాంఖడేలో ముంబై ఇండియన్స్ బౌలర్లను బాదేసిన అర్చర్.. అనంతరం బంతితోనూ ఆ జట్టు బ్యాటర్లను వణికించాడు. బ్రిజేష్ శర్మ(2-26), బర్గర్(2-43) కీలక వికెట్లు తీసి సహకరించగా 8వ విజయం.. 16 పాయింట్లతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది.
A 𝙍𝙤𝙮𝙖𝙡 𝙀𝙣𝙩𝙧𝙮 into the Playoffs ✅
Make way for the @rajasthanroyals 🩷#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/egtoP5bh7e
— IndianPremierLeague (@IPL) May 24, 2026
రాజస్థాన్‌కు భారీ స్కోర్ సమర్పించుకున్న ముంబై బ్యాటింగ్‌లో తడబడుతోంది. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ(0)ను డకౌట్ చేసిన ఆర్చర్(3-17) తర్వాతి ఓవర్లో నమన్ ధిర్(6)ను బౌల్డ్ చేసి రెండో వికెట్ అందించాడు. బర్గర్ ఓవర్లో రికెల్టన్(12)కవర్స్‌లో వైభవ్ చేతికి చిక్కగా. 24 వద్ద మూడో వికెట్ పడింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్(60)తో కలిసి తిలక్ వర్మ(3) ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నాడు. కానీ, బ్రిజేష్ అతడిని బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై.
Terrific reflexes ⚡️
Was that the final blow from Nandre Burger and #RR? 🤔
Updates ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/x1AMvtH0tn
— IndianPremierLeague (@IPL) May 24, 2026
విల్ జాక్స్(33) జతగా సూర్య ధనాధన్ ఆడగా ముంబై స్కోర్ వంద దాటింది. అయితే.. ఐదో వికెట్‌కు 63 రన్స్ జోడించిన జాక్స్‌ను యశ్ రాజ్ ఔట్ చేయగా వస్తూనే హార్దిక్ పాండ్యా(34) రెండు సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. గెలిపించే బాధ్య తీసుకున్న ఈ ఇద్దరూ రాజస్థాన్‌ను భయపెట్టారు. రెండో స్పెల్‌లో ఆర్చర్ మరో వికెట్ అందిస్తూ పాండ్యాను వెనక్కి పంపాడు. కార్బిన్ బాస్చ్(2) విఫలమవ్వగా.. శార్దూల్ ఠాకూర్(10 నాటౌట్) అండతో ముంబైని గట్టెక్కించాలనుకున్న సూర్యను బర్గర్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్లో 37 రన్స్ అవసరమవ్వగా శనక ఆరు పరుగులే ఇచ్చాడు. దాంతో.. 30 పరుగులతో గెలుపొందిన రాజస్థాన్ నాలుగో స్థానంతో మురిసింది.
ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. పవర్ ప్లేలోనే ముంబై ఇండియన్స్ బౌలర్లు మూడువికెట్లతో దెబ్బతీయగా.. మిడిలార్డర్ సైతం తడబడింది. దంచికొట్టే ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే ఔటైన వేళ ధ్రువ్ జురెల్(38), ఆర్చర్(32)లు ఆపద్భాదంవులయ్యారు. కానీ, డెత్ ఓవర్లలో శార్దూల్(2-41) విజృంభించినా జడేజా(19 నాటౌట్) మెరుపులతో రాజస్థాన్ రెండొందలు కొట్టింది.