కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్లో మరో పోరు వర్షార్పణమైంది. మంగళవారం శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మైదానం ఏ మాత్రం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.
దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. తొలుత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 258/6 స్కోరు చేసింది. కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ నీలాక్షిక సిల్వా(28 బంతుల్లో 55 నాటౌట్, 7ఫోర్లు, సిక్స్), కెప్టెన్ చమరీ ఆటపట్టు(53) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. సోఫీ డివైన్(3/54)కు మూడు వికెట్లు దక్కాయి.