కాన్బెర్రా : అడిలైడ్ టెస్టుకు సన్నాహంగా భారత్, ప్రైమినిస్టర్ లెవన్ మధ్య ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌పై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. తొలిరోజు శనివారం ఎడతెరిపిలేని వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఉద యం నుంచి కురిసిన వానతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఆటకు అనువుగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. రెండో రోజైన ఆదివారం 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. పెర్త్ టెస్టులో ఆడని కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ మ్యా చ్ ప్రాక్టీస్ దక్కకుండా పోయింది. ఈనెల 6 నుంచి మొదలయ్యే రెండో టెస్టులో రోహిత్, గిల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్‌ను తప్పించనున్నారు.