Asia Cup 2023 : రిజర్వ్ డే నాడు కూడా భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ పూర్తి కాగానే చినుకులు మొదలయ్యాయి. అప్పటికి పాక్ రెండు వికట్ల నష్టానికి 44 రన్స్ చేసింది. పాక్ విజయానికి ఇంకా 313 రన్స్ కావాలి. 11వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం(10)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఓపెనర్ ఫఖర్ జమాన్(14), మహమ్మద్ రిజ్వాన్(1) పరుగులతో ఆడుతున్న సమయంలో వాన షురూ అయింది. దాంతో, అంపైర్లు మ్యాచ్ నిలిపి వేశారు. వర్షం తగ్గాక పూర్తి ఓవర్ల ఆట సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దాంతో, ఓవర్లు కుదించే అవకాశం ఉంది.
Hardik Pandya comes into the attack and strikes on his fourth delivery 🔥
Babar Azam is bowled for 10 runs.
Live – https://t.co/Jao6lKkoCx… #INDvPAK pic.twitter.com/qyfAe2FMPI
— BCCI (@BCCI) September 11, 2023
అదే జరిగితే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఈ పద్ధతిన పాక్ 20 ఓవర్లలో 200 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 22 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తే 216 రన్స్, 24 ఓవర్ల ఆట సాధ్యమైతే 230 పరుగులు చేయాలి. 26 ఓవర్లు ఆడాల్సి వస్తే బాబర్ సేన 244 పరుగులు చేయాల్సి ఉంటుంది. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఐదో ఓవర్లోనే ఓపెనర్ ఇమాముల్ హక్(9)ను బుమ్రా ఔట్ చేశాడు.
కోహ్లీ(122 నాటౌట్), రాహుల్(111 నాటౌట్)
మొదట ఆడిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 రన్స్ కొట్టింది. విరాట్ కోహ్లీ(122 నాటౌట్ : 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కేఎల్ రాహుల్(111 నాటౌట్ : 106 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో విజృంభించారు. దాంతో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 356 రన్స్ కొట్టింది. తనకు ఎంతో అచ్చొచ్చిన కొలంబోలో విరాట్ వరుసగా నాలుగు శతకాలు బాదడం విశేషం. అంతేకాదు విధ్వంసక సెంచరీలతో పాక్ బౌలర్లపై విరుచుకు పడిన కోహ్లీ, రాహుల్‌తో కలిసి పలు రికార్డులు బద్ధలు కొట్టాడు.