IND vs SA | ఫైనల్‌కు వాన ముప్పు.. బార్బడోస్‌లో ఎలా ఉండనుందంటే..?
IND vs SA : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)లు టైటిల్ ఫైట్ కోసం ఇప్పటికే బార్బడోస్ చేరుకున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈమ్యాచ్‌కు వాన ముప్పు ఉందని సమాచారం.
IND vs SA : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. తొమ్మిదో సీజన్లో అజేయంగా నిలిచిన భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)లు టైటిల్ ఫైట్ కోసం ఇప్పటికే బార్బడోస్ చేరుకున్నాయి. అక్కడి బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ (Kensington Oval) వేదికగా రోహిత్ శర్మ బృంద మర్క్రమ్ సేనతో తలపడనుంది. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈమ్యాచ్‌కు వాన ముప్పు ఉందని సమాచారం.
జూన్ 28 శుక్రవారం బార్బడోస్‌లో భారీ వాన పడింది. కింగ్స్టన్ ఓవల్ స్టేడియం సైతం తడిసిముద్దైంది. ఇదే పరిస్థితి శనివారం కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ రోజున బ్రిడ్జ్‌టౌన్‌లో మేఘాలు కమ్మి ఉంటాయని, వాన కురిసేందుకు 60 శాతం చాన్స్ ఉందని టాక్. దాంతో, పూర్తి స్థాయిలో 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చచ్చు. వరుణుడు అంతరాయం కలిగిస్తే.. 190 నిమిషాల అదనపు టైమ్ ఉంది.
The unstoppable forces meet 🇿🇦🇮🇳
Aiden Markram 🆚 Rohit Sharma – who will lift the #T20WorldCup trophy? 🤔 pic.twitter.com/hlR4hasBIp
— ICC (@ICC) June 28, 2024
కనీసం 10 ఓవర్లు
ఒకవేళ అదనపు టైమ్ ముగిసే సమయానికి ఔట్ ఫీల్డ్ తడిగా ఉండి ఆట సాధ్యం కాకుంటే ఎలాగూ రిజర్వ్ డే (Reserve Day) ఉండనే ఉంది. రిజర్వ్ డే అయిన జూన్ 30వ తేదీ ఆదివారం యథావిధిగా మ్యాచ్ అరంభమవుతుంది. ఆ రోజు కూడా వాన అంతరాయం కలిగిస్తే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. చివరకు అదీ కూడా వీలు పడలేదంటే.. భారత్, దక్షిణాఫ్రికాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
INDIAN TEAM REACHED BARBADOS FOR THE FINAL….!!! [ANI]
– All the best, Rohit & his boys. 🇮🇳 pic.twitter.com/NRg1yekpXI
— Johns. (@CricCrazyJohns) June 28, 2024
ఇవి కూడా చదవండి
- Car discounts | మారుతి బ్రెజా టు ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ వరకూ డిస్కౌంట్ల వర్షం.. 1.4 లక్షల నుంచి రూ.3.40 లక్షల రాయితీలు.. !
- EPFO | ఇకపై జీఐఎస్ డిడక్షన్లు ఉండవు.. కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో
- IPS Tranfers | ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

