న్యూయార్క్: ఇండోపాక్ వార్‌ను ఆపినట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మళ్లీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో పామ్‌బీచ్‌లో ట్రంప్‌తో నెతన్యూ భేటీ అయ్యారు. రెండోసారి వైట్‌హౌజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు 8 యుద్ధాలను నివారించినట్లు ట్రంప్ తెలిపారు. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, టారిఫ్‌లతో ఆ రెండు దేశాలను బెదిరించినట్లు చెప్పారు. కానీ తనకు అనుకున్నంత క్రెడిట్ దక్కలేదన్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైటింగ్‌ను కూడా ఆపినట్లు ట్రంప్ వెల్లడించారు.
అజర్బైజాన్ యుద్ధాన్ని ఆపిన తీరు పట్ల పుతిన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు ట్రంప్ చెప్పారు. వాణిజ్యాన్ని నిలిపివేస్తానని అజర్‌బైజాన్‌ను బెదిరించామని, 200 శాతం టారిఫ్ విధిస్తామని చెప్పామన్నారు. దీంతో 35 ఏళ్ల ఫైటింగ్‌కు ఆ దేశం ఫుల్స్టాప్ పెట్టిందన్నారు. ఆ పని చేసినందుకు నాకేమీ క్రెడిట్ దక్కలేదని, అలాగే 8 యుద్ధాలను ఆపానన్నారు. ఇండియా, పాక్ వార్‌ను కూడా ఆపినట్లు ట్రంప్ చెప్పారు.
ఇండోపాక్ సంక్షోభ అంశంపై ఇప్పటి వరకు సుమారు 70 సార్లు ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.