Car discounts | మారుతి బ్రెజా టు ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ వరకూ డిస్కౌంట్ల వర్షం.. 1.4 లక్షల నుంచి రూ.3.40 లక్షల రాయితీలు.. !
Car Discounts | రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతుండటంతో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి.
Car discounts | గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా ఉండే, సేఫ్టీ, సౌకర్యవంతమైన ఫీచర్లు గల కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతుండటంతో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా జత కలిసింది. మారుతి సుజుకి తన టాప్ ఎస్ యూవీ కారుపై గరిష్టంగా రూ.1.4 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
గ్రాండ్ విటారా కారుపై రూ.1.4 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది మారుతి సుజుకి. అయితే హైబ్రీడ్ మోడల్ కార్లకు మాత్రమే గరిష్ట డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర మోడల్ కార్లకు దాదాపు రూ.65 వేల రాయితీ ప్రకటించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్జీ వర్షన్లలో లభిస్తుంది. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, జెటా+, ఆల్ఫా+ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్, ఈ-సీవీ వర్షన్లతోపాటు వేర్వేరు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఇంతకుముందు మారుతి సుజుకి తన జిమ్నీ మోడల్ కారుపై గరిష్టంగా రూ.1.5 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఇక మిగతా స్విఫ్ట్, బ్రెజా, ఆల్టో, వ్యాగన్ఆర్, డిజైర్, సెలెరియో వంటి కార్లపై రూ.58 వేల వరకూ, ఫ్రాంక్స్ మోడల్ మీద రూ.72 వేల వరకూ డిస్కౌంట్ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి.
టాటా మోటార్స్ తన నెక్సాన్ కారుపై రూ.లక్ష డిస్కౌంట్ అందిస్తోంది.
హోండా ఎలివేట్ కారు మీద రూ.55 వేల వరకూ రాయితీ, హోండా అమేజ్ అండ్ హోండా సిటీ మోడల్ కార్లపై రూ.30 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
హ్యుండాయ్ వెన్యూపై ఎక్స్చేంజ్ ఆఫర్‌తోపాటు రూ.30 వేల వరకూ క్యాష్ డిస్కౌంట్, అల్కాజర్ మీద రూ.65 వేల వరకూ, ఐ10 నియోస్ మీద రూ.35 వేల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది.
ఫోక్స్ వ్యాగన్ తన టిగువాన్ మీద గరిష్టంగా రూ.3.40 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. విర్టస్ మోడల్ కారు మీద రూ.20 వేల రాయితీ, టైగూన్ మీద రూ.1.80 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
ఇవి కూడా చదవండి :
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

