EPFO | ఇకపై జీఐఎస్ డిడక్షన్లు ఉండవు.. కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో
EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం 2013 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. వీరికి యథావిధిగా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. కాబట్టి 2013 సెప్టెంబర్ 1 తర్వాత జాబ్‌లో చేరిన ఆయా కేటగిరిలో ఉన్న ఉద్యోగులు వచ్చే నెల నుంచి ఎక్కువ వేతనం పొందనున్నారు.
2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఇప్పటివరకు డిడక్షన్ అయిన మొత్తం కూడా రీఫండ్ అవుతుంది. జీఐఎస్ పరిధి నుంచి వీరిని శాశ్వతంగా తొలగించనున్నారు. జీఐఎస్ కింద తగ్గింపులు నిలిపివేయడంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలు కూడా పెరగనున్నాయి.
గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది 1982 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారు ప్రమాదాలకు గురైనప్పుడు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశంగా దీన్ని తీసుకొచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

