Siddu Jonnalagadda | టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలు కొంత బ్రేక్ వేశాయి. అయినప్పటికీ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సిద్ధు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సిద్ధు తన తదుపరి సినిమాను అధికారికంగా లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి సిద్ధు, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జేతో చేతులు కలపబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు సమాచారం. కంటెంట్‌కు పెద్ద పీట వేసే ఈ బ్యానర్లో సిద్ధు – స్వరూప్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోయాయి.
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ లాంటి చిత్రాలతో యువతలో సూపర్ క్రేజ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ, కామెడీ, స్టైల్, డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాతో కొత్తగా ట్రై చేస్తూ ముందుకు వెళ్తున్న సిద్ధు, ఇప్పుడు స్వరూప్ ఆర్ఎస్జే లాంటి డిఫరెంట్ థింకింగ్ ఉన్న దర్శకుడితో సినిమా చేయడం కెరీర్‌కు మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హ్యూమర్, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేను సమర్థంగా మేళవించి డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈసారి మాత్రం తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తూనే, సిద్ధు ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తిగా కొత్త కథతో ముందుకు వస్తున్నారని టాక్.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడమే సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది. క్వాలిటీ కంటెంట్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో రాజీపడని ఈ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి. ఇప్పుడు ఈ బ్యానర్లో సిద్ధు – స్వరూప్ కాంబినేషన్ రావడంతో ఈ చిత్రం ఇండస్ట్రీలో హాట్ ప్రాజెక్ట్‌గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా పూర్తిగా కొత్త జానర్లో ఉండబోతోందట. ఇందులో సిద్ధు పాత్ర ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. కామెడీతో పాటు ఇంటెన్స్ మోమెంట్స్, స్వరూప్ మార్క్ ట్విస్టులు కథలో కీలకంగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధు డైలాగ్ టైమింగ్‌కు స్వరూప్ కథన శైలి కలిస్తే ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పడటం ఖాయమని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.