INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం మధ్నాహ్నం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పోరులో టాస్ పడగానే వాన అందుకుంది. కాసేపు దంచేసిన వరుణుడు కాసింత శాంతించినా.. చినుకులు మాత్రం పూర్తిగా తగ్గలేదు. దాంతో.. పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ మొత్తాన్ని ప్లాస్టిక్ కవర్లలో కప్పేశారు. పరిస్థితి చూస్తుంటే.. భారత జట్టు ఇన్నింగ్స్ ఆలస్యం కావడమే కాదు ఓవర్ల కోటాపై కూడా కోత పడే అవకాశముంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలుపొందిన హర్మన్‌ప్రీత్ బౌలింగ్ ఎంచుకుంది. కాసేపట్లో బంగ్లా ఇన్నింగ్స్ ఆరంభం కానుంది అనుకున్న ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తూ వర్షం మొదలైంది. వాన ఎప్పుడు తగ్గుతుందబ్బా? అని ఇరుజట్ల క్రికెటర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు ఆకాశంకేసి చూస్తున్నారు.
The toss is done, but rains have returned in Mumbai 😔 pic.twitter.com/pvGQt1oHZE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2025
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో మెరుగైన రికార్డే ఉంది టీమిండియాకు. ఇప్పటివరకూ 8 మ్యాచుల్లో ఆరింట భారత్ గెలుపొందగా.. ఒకటి టైగా ముగిసింది. 2023 ద్వైపాక్షిక సిరీస్‌లో ఒకేఒక మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న ఆ జట్టును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, బౌలింగ్‌లో మరుఫా అక్తర్, షోర్నా అక్తర్ గొప్పగా రాణిస్తున్నారు. వీరిద్దరి నుంచి ముప్పు ఎదురయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ మ్యాచ్‌తో ఉమా ఛెత్రీ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. టాస్కు ముందు తను వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నుంచి తను డెబ్యూట్ క్యాప్ అందుకుంది.
ODI debut in a World Cup game ✨👌
Special moment as debutant Uma Chetry receives her ODI cap from vice-captain Smriti Mandhana 🧢
Updates ▶️ https://t.co/lkuocSlGGJ#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvBAN pic.twitter.com/nt1Qn6Md8G
— BCCI Women (@BCCIWomen) October 26, 2025