IPL 2025 : వరుసగా రెండోమ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వాంఖడేలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఇన్నింగ్స్‌కు భారీ వర్షం అడ్డుపడింది. 14 ఓవర్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. మైదానం సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. ఇంకా గుజరాత్ విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి.
ఒకవేళ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించాల్సి వస్తే.. ముంబై కంటే 8 పరుగులు ఎక్కువ చేసిన గుజరాత్‌ను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. మ్యాచ్‌క వర్షం ఆటంకం కలిగించే సమయానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(38 నాటౌట్), ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(26 నాటౌట్)లు ఆడుతున్నారు.
𝙂𝙞𝙡𝙡-𝙤𝙧𝙞𝙤𝙪𝙨 𝙎𝙝𝙪𝙗𝙢𝙖𝙣 🤩
Beautiful extension of the arms by the #GT skipper 👌
Will he guide his team home? 🤔
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT | @ShubmanGill pic.twitter.com/lWXTq1NkQk
— IndianPremierLeague (@IPL) May 6, 2025
ముంబై నిర్దేశించిన 156 పరుగుల ఛేదనలో గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ సాయి సుదర్శన్ (5) వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అతడిని బౌల్ట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత జోస్ బట్లర్(30) జతగా శుభ్‌మన్ గిల్(38) దంచాడు. వీళ్లిద్దరూ ముంబై బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు రాబట్టారు. అప్పటికే మైదానంలో గాలి బలంగా వీయడం మొదలెట్టింది. దాంతో, ఇద్దరూ చకచకా సింగిల్స్ తీస్తూ రన్ రేటు తగ్కుండా చూసుకున్నారు.
Match 5⃣6⃣ between @mipaltan and @gujarat_titans has stopped due to rain 🌧️
Stay tuned for further updates.
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/3iMaIiJnL5
— IndianPremierLeague (@IPL) May 6, 2025
హార్దిక్ పాండ్యా ఓవర్లో రెండు నో బాల్స్, మూడు వైడ్స్ సహా 6 సమర్పించుకున్నాడు. దాంతో గుజరాత్ స్కోర్ వేగం అందుకుంది. రెండో 72 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని అశ్వని కుమార్ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన ఇంప్యాక్ట్ ప్లేయర్ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(26) ధనాధన్ ఆడాడు. విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్లో వరుసగా 4, 4, 6 బాది 15 పరుగులు పిండుకున్నాడు. అనంతరం అశ్వనీ బౌలింగ్‌లోనూ రెచ్చిపోయిన ఈ హిట్టర్ సిక్సర్‌తో జట్టు స్కోర్ 100 దాటించాడు.
వాంఖడేలో రెచ్చిపోయే ఆడే ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు గుజరాత్ బౌలర్లు ముకుతాడు వేశారు. టాపార్డర్‌లో విల్ జాక్స్(53) అర్ధ శతకంతో చెలరేగగా.. 97-3తో పటిష్టంగా ఉన్న ముంబై.. మిడిల్ ఓవర్లలో సాయి కిశోర్(2-34), రషీద్ ఖాన్(1-21)ల విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో, ఆ జట్టు స్కోర్ 130 దాటడమే గగనం అనిపించింది. కానీ, ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్(2) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 20వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు సబాదాడు. ఆఖరి బంతికి దీపక్ చాహర్ బౌండరీ కొట్టడంతో ముంబై 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.