India Vs Pakistan | ఆసియా కప్‌లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం వీడటం లేదు. తొలుత టీం ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు సార్లు మ్యాచ్ వాయిదా పడింది. తర్వాత టీం ఇండియా బ్యాటింగ్ చేసి 266 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ముంగిట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
పాక్ బ్యాటింగ్ ప్రారంభం కావడానికి ముందే మళ్లీ వర్షం కురుస్తున్నది. ఇప్పటికీ పాక్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో వర్షం నిలిచిపోయిన తర్వాత పాక్ బ్యాటింగ్‌కి దిగితే ఓవర్లను కుదించే అవకాశం ఉంటుంది.
40 ఓవర్లకు కుదిస్తే పాకిస్థాన్ విజయ లక్ష్యం 239 పరుగులుగా నిర్దేశించే అవకాశం ఉంటుంది.. 36 ఓవర్లకు 226 పరుగులు 30 ఓవర్లకు 203 పరుగులు, 20 ఓవర్లకు 155 పరుగులు చేయాల్సి ఉంటుంది.