బెంగుళూరు: ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్నది. అయితే వర్షం వల్ల ప్రస్తుతం టాస్ ఆలస్యం అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారింది. గ్రౌండ్లో ఇంకా కవర్స్ అలాగే ఉండిపోయాయి. అయితే ఇవాళ రోజంతా జల్లులు కురుస్తుంటాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. రేపు కూడా బెంగుళూరులో మేఘావృతం అయి ఉంటుందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది.
Hello from Bengaluru 👋
Toss for the 1st #INDvNZ Test has been delayed due to rain.
Stay tuned for further updates.#TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 16, 2024
ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడిన కివీస్ దాంట్లో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ ఇటీవల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. లంక సిరీస్లో ఓటమి తర్వాత అతను వైదొలిగాడు. ప్రస్తుత సిరీస్కు టామ్ లాథమ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.అయితే 400 వికెట్లకు 15 వికెట్ల దూరంలో ఉన్న టిమ్ సౌథీ తుది జట్టులో స్థానం సంపాదిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila
— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024