న్యూఢిల్లీ: రెజ్లర్లు వినేశ్ ఫోగట్(Vinesh Phogat), భజరంగ్ పూనియాలు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాలను ఆమోదించినట్లు రైల్వేశాఖ ఇవాళ తెలిపింది. ఈ ఇద్దరు రెజ్లర్లు కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరూ హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. రాజీనామాకు ముందు ఇవ్వాల్సిన మూడు నెలల నోటీస్ పీరియడ్‌ను ఎత్తివేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వినేశ్ ఫోగల్ .. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నారు.
ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్ల .. సర్వీస్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర రైల్వేశాఖ తెలిపింది. ఆ నోటీసు ఇచ్చిన తర్వాతనే.. ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు. బీజేపీ ఎంపీ , రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫోగల్, భజరంగ్ పూనియాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
గత నెలలో ముగిసిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో.. వినేశ్ ఫోగట్ తన క్యాటగిరీలో అనర్హతకు గురైంది. వంద గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు.