KL Rahul : వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే జట్టు కోసం ఏ త్యాగానికికైనా సిద్ధపడేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన క్రికెటరే కేఎల్ రాహుల్ (KL Rahul). ఫార్మాట్ ఏదైనా టీమిండియా ఆపద్భాందవుడి పాత్రలో ఒదిగిపోతున్న రాహుల్ వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన రాహుల్ రిటైర్మెంట్ గురించి పెద్దగా ఆలోచించనని, క్రికెట్ ఒక్కటే జీవితం కాదని అన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. వీడ్కోలు పలకాలనే ఆలోచన తనకు వచ్చిందని.. అయితే.. అందుకు ఇంకాస్త సమయం ఉందని ఈ సొగసరి బ్యాటర్ వెల్లడించాడు.
బ్యాటింగ్ ఆర్డర్ మారడం నా వల్ల కాదు.. కెప్టెన్సీ కాకుండా వైస్ కెప్టెన్సీ ఇస్తారా? వంటి ఫిర్యాదులకు ఆమడ దూరంలో ఉండే రాహుల్ తనలో మరొకొన్ని రోజులు క్రికెట్ ఆడే సత్తా ఉందంటున్నాడు. యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అతడు.. ‘ఒకానొక సమయంలో వీడ్కోలు గురించి ఆలోచించాను. నా దృష్టిలో రిటైరవ్వడం కష్టమైనదేమీ కాదు. మనపట్ల మనం నిజాయతీగా ఉన్నప్పుడు.. సరైన సమయం వచ్చినప్పుడు వీడ్కోలు నిర్ణయాన్ని రోజుల తరబడి వాయిదా వేయడంలో అర్థముండదు. ప్రస్తుతానికైతే నేను అల్విదా చెప్పడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. రిటైర్మెంట్ ప్రకటించాక.. కుటుంబంతో నచ్చినట్టుగా జీవితాన్ని గడిపేందుకు ప్రాధాన్యమిస్తాను.
KL Rahul opened up on retirement during a chat with @KP24 for his YouTube show. pic.twitter.com/VnpgHuSNjo
— Circle of Cricket (@circleofcricket) January 27, 2026
ఒక క్రికెటర్ అలా ఉండడం కాస్త కష్టమే. కానీ, నేను అంత ముఖ్యమైన ఆటగాడిని కాదని నా ఉద్దేశం. ఎవరు వీడ్కోలు పలికినా సరే మనదేశంలో క్రికెట్ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే చెబుతున్నా.. జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి. నేను ఈమధ్యే తండ్రినయ్యాను. పాప పుట్టాక నేను జీవితాన్ని చూసే దృక్కోణం ఎంతో మారింది’ అని పేర్కొన్నాడు.
KL Rahul’s Say on Retirement 🥲 pic.twitter.com/9R4Sm7p77j
— 𝙎. (@KLfied_) January 27, 2026
అనుభవజ్ఞుడైన రాహుల్ కెప్టెన్‌గా జట్టును నడిపించాల్సింది. కానీ, గాయాల కారణంగా అతడు పలుమార్లు జట్టుకు దూరమయ్యాడు. ఇదే అంశంపై స్పందించిన రాహుల్.. ‘గతంలో నేను చాలా సార్లు గాయపడ్డాను. స్పోర్ట్స్ హెర్నియా కారణంగా ఆస్పత్రి పాలయ్యాను. గాయాలతో పోరాడి.. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. ఆ రోజులు నిజంగా ఎంతో కష్టంగా గడిచాయి. మానసికంగా కొన్నిసార్లు కుంగిపోయేవాడిని. అలాంటప్పుడు ఇక చాలు. క్రికెట్ లేకుండా కూడా నువ్వు బతకగలవు అని మన మనసు చెబుతుంది’ అని వెల్లడించాడు.
Cricketer KL Rahul and actress Athiya Shetty tie the knot | Wedding photos pic.twitter.com/wjljU5l9We
— BellPost (@UtpalKanta83) January 23, 2023
ఫార్మాట్ ఏదైనా జట్టులో ఉండాల్సిన ఆటగాడు రాహుల్. అనుభవమే కాదు.. పరిస్థితులకు తగ్గట్టు ఆడగల నైపుణ్యం కలిగిన ఈ కర్నాటక స్టార్ ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు కొండంత ఆస్తిలా మారాడు. స్వదేశంలో.. రాబోయే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌కు ఎంపికైన రాహుల్.. జట్టును గెలిపించే బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ 67 టెస్టులు, 94 వన్డేలు ఆడిన రాహుల్.. ఐపీఎల్‌లోనూ తన మార్క్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో డేంజరస్ బ్యాటర్ల జాబితాలో చేరాడు.
KKR Looking For A Trade Deal For Bringing In KL Rahul Into Their Squad For IPL 2026 : Report
If You Haven’t Noticed KL Rahul Has Got His Luck Back Since He Has Started Keeping Pony
According To Indian Astrology When Your Rahu Is Weak,Keeping Pony Helps You Focus#KLRahul #KKR pic.twitter.com/jEsprVgufo
— Sachiin Ramdas Suryavanshi (@sachiinv7) July 31, 2025