BCCI : వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న సెలెక్టర్లు అనుభవానికి పెద్ద పీట వేశారు. ఇంగ్లండ్ పర్యటన కోసం సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లను ఎంపిక చేశారు. అఫ్గనిస్థాన్‌పై చెపాక్ వన్డేలో శతకంతో మెరిసిన యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)ను మాత్రం పక్కన పెట్టేశారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం ఎంపిక చేసిన 15 మందిలో పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా, యువకెరటం గుర్నూర్ బ్రార్‌కు చోటు దక్కింది.
స్వదేశంలో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా వచ్చే నెలలో ఇంగ్లండ్ వెళ్లనుంది. అక్కడ వన్డే సిరీస్ కోసం ఆదివారం భారత సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ సారథిగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన స్క్వాడ్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మను తీసుకున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న విరాట్ కోహ్లీ స్క్వాడ్‌లోకి రాగా.. ఆల్‌రౌండర్ విభాగంలో నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రానాలు చోటు సంపాదించారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు.
🚨 News 🚨
India’s ODI squad for the England tour announced.
𝗡𝗢𝗧𝗘: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
— BCCI (@BCCI) June 21, 2026
ఇక పేస్ దళంలో సీనియర్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ కొత్త బంతిని పంచుకోనున్నాడు. అఫ్గనిస్థాన్‌పై చివరి వన్డేలో ఐదు వికెట్లు తీసిన ప్రసిధ్‌పై, ఇదే సిరీస్‌లో 7 వికెట్లతో ఆకట్టుకున్న గుర్నూర్ బ్రార్ సైతం ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యారు. జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది.
భారత స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్(), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రానా, గుర్నూర్ బ్రార్.