టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా సోకిందా? ఆసియా కప్‌లో జట్టుకు దగ్గరుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ద్రావిడ్‌కు లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి కొన్నిరోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నేపథ్యంలో.. రాహుల్‌కు కరోనా సోకడం క్రీడాభిమానులతోపాటు జట్టుకు కూడా షాకింగ్ వార్తే.
అయితే కరోనా కారణంగా ఆసియా కప్ సమయంలో జట్టుకు ద్రవిడ్ దూరంగా ఉండటం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 27 నుంచి ఆసియా కప్ మొదలవుతుండగా.. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది.