Rahul Dravid : ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంలో భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కీలక పాత్ర పోషించాడు. రాంచీ టెస్టు(Ranchi Test)లో ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో.. ‘మీరు కాకపోతే ఇంకెవ్వరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ వంటి మాటలతో కుర్రాళ్లలో స్ఫూర్తి నింపి సిరీస్ విజయంలో తన ముద్ర వేశాడు. శనివారం ధర్మశాల టెస్టు(Dharmashala Test)లో టీమిండియా విజయం అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్లపై ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.
అంతేకాదు ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్(Central Contract) కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సెంట్రల్ కాంట్రాక్ట్‌లు అనేవి నా పరిధిలో ఉండవు. అందుకని నేను వాటి గురించి మాట్లాడను. సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాలు కూడా నాకు తెలియవు. ఇక.. అయ్యర్, ఇషాన్ విషయానికొస్తే.. వాళ్లు క్రికెట్ ఆడుతారని నమ్ముతున్నా. వాళ్లు ఫిట్‌గా ఉండి సెలెక్టర్ల దృష్టిలో పడాలి. ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అయితే.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేనివాళ్లు సైతం భారత్‌కు ఆడారు’ అని ద్రవిడ్ అన్నాడు.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్
‘రోహిత్, నేను తుది జట్టుని ఎంపిక చేస్తాం. అయితే.. వాళ్లలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు? అనేది నాకు తెలియదు. మనం ఆటగాళ్లు చెప్పేది వినాలి. ఎందుకంటే వాళ్లే కదా మైదానంలో పోరాడేది. ఒకవేళ వాళ్లు దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ మేనేజ్మెంట్ గురించి అడిగితే వివరించాలి’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
రంజీల్లో ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన అయ్యర్, ఇషాన్‌లు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారు. వేటు పడితేగానీ బుద్దిరాదంటూ.. ప్రస్తుతం ఇద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. అయితే.. అయ్యర్ వరుసగా సెమీస్‌లో డకౌట్, విదర్భతో జరుగుతున్న ఫైనల్లో7 పరుగులతో నిరాశపరిచాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడు టీమిండియా జెర్సీ వేసుకునేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. మరోవైపు బరోడా స్టేడియంలో శిక్షణ పొందుతున్న ఇషాన్ ఫామ్ చాటుకునేందుకు సిద్దమవుతున్నాడు.