న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ తన గౌరవాన్ని మరింత పెంచుకున్నాడు. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన ద్రవిడ్‌కు ప్లేయర్లతో సమానంగా బీసీసీఐ 5కోట్ల నజరానా ప్రకటించింది. అయితే దీన్ని ఈ క్రికెట్ దిగ్గజం సున్నితంగా తిరస్కరించాడు. కోచింగ్ బృందంలో అందరికి ఇచ్చినట్లే తనకు 2.5కోట్లు ఇవ్వండని, ఎక్కువ వద్దంటూ ద్రవిడ్ స్పష్టం చేశాడు. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌తో ద్రవిడ్ గడువు ముగిసినా..టీ20 వరల్డ్‌కప్ వరకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది.