Rahul Dravid : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు మరో రెండు రోజులే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ వేగం పెంచింది. అయితే.. తొలి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్(KL Rahul)నే వికెట్ కీపర్‌గా ఆడిస్తారా?.. లేదంటే సంజూ శాంసన్(Sanju Samson), ధ్రువ్ జురెల్(Druv Jurel), శ్రీకర్ భరత్(Srikar Bharat)లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే ప్రశ్నల నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ సిరీస్‌లో కేఎల్ రాహెల్ వికెట్ కీపింగ్ చేయడని ద్రవిడ్ చెప్పాడు. ‘ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చేయడు. జట్టు ఎంపిక ముందే ఈ విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. అందుకనే మరో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశాం. దక్షిణాఫ్రికా పర్యటనలో రాహుల్ గొప్ప ప్రదర్శన చేశాడు. టెస్టు సిరీస్ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఐదు టెస్టుల సిరీస్, పరిస్థితులు దృష్ట్యా రాహుల్‌ను బ్యాటర్‌గానే ఆడించనున్నాం ‘ అని ద్రవిడ్ తెలిపాడు.
KL Rahul will play as a batter – it’s going to be between KS Bharat & Dhruv Jurel 🧤#INDvENG pic.twitter.com/wnZ5GZb63t
— ESPNcricinfo (@ESPNcricinfo) January 23, 2024
రాహుల్ 2020 నుంచి వన్డేల్లో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. నిరుడు ఆసియా కప్, సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ వికెట్ల వెనుక మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ మధ్యే ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో అతడు కీపింగ్ చాన్స్ కొట్టేశాడు. సెంచూరియన్ టెస్టు సూపర్ సెంచరీ బాదిన రాహుల్ వికెట్ కీపర్‌గానూ సత్తా చాటాడు.
శ్రీకర్ భరత్, ధ్రువ్ జురెల్
అయితే.. మరో నాలుగు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున రాహుల్‌పై ఒత్తిడి పడకుండా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకనే అతడికి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో కీపర్‌గా బాధ్యతలు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాహుల్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, శ్రీకర్ భరత్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.