Travis Head | ఆస్ట్రేలియా ఓపెనర్‌కు కొవిడ్ పాజిటివ్.. బ్రిస్బేన్ టెస్టుకు దూరమయ్యేనా..?
Travis Head : సొంతగడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా(Australia)కు పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) మరోసారి కరోనా(Carona) బారిన పడ్డాడు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నహెడ్కు పరీక్షలు...
Travis Head : సొంతగడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా(Australia)కు పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) మరోసారి కరోనా(Carona) బారిన పడ్డాడు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నహెడ్కు పరీక్షలు జరపగా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో, అతడు బ్రిస్బేన్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో ఆడతాడా? లేదా? అనే సందేహం నెలకొంది.
అయితే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం హెడ్ దాదాపు కోలుకున్నాడని, అతడు కచ్చింతగా మ్యాచ్ ఆడతాడని చెప్పాడు. ‘హెడ్‌కు ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందని అనుకుంటున్నా. అతడు ఈరోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు’ అని కమిన్స్ వెల్లడించాడు. తొలి టెస్టులో గాయపడిన మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) కంకషన్ టెస్టు పాసవ్వడం ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చే విషయం.

హెడ్ కరోనా బారిన పడడం ఇది రెండోసారి. 2021-22లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్(Ashes Series) సమయంలో కొవిడ్ పాజిటివ్ కారణంగా ఈ స్టార్ ప్లేయర్ ఐసోలేషన్‌లో ఉండిపోయాడు. దాంతో, ఉస్మాన్ ఖవాజా ఓపెనర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఉస్మాన్ ఖవాజా

సంచలన ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన హెడ్ అనతికాలంలోనే ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. భారతగడ్డపై నిరుడు జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) ఫైనల్లో హెడ్ ఓ రేంజ్లో ఆడాడు. టీమిండియా టాపార్డర్ విఫలమైన చోట సెంచరీతో కదం తొక్కి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో, కంగారూ జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే చాంపియన్‌గా అవతరించింది. సొంతగడ్డపై పాకిస్థాన్‌పై దంచికొట్టిన హెడ్.. తొలి టెస్టులో విండీస్ బౌలర్లను ఉతికారేసిన హెడ్ సెంచరీ సాధించాడు. అనంతరం హేజిల్‌వుడ్, కమిన్స్ విజృంభిచండంతో బ్రాత్ వైట్ సేన కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి
- Ayalaan 2 | ఈ సారి ఫస్ట్ పార్టుకు మించి.. అయలాన్ 2 వచ్చేస్తుంది
- Ram Lalla Idol: టెంటులో రాముడిని ఎక్కడ ప్రతిష్టిస్తారు?
- Ayodhya | భక్తజన సంద్రంగా రామాలయం..త్రేతా యుగం రోజులను తలపిస్తున్న అయోధ్య : ఆచార్య సత్యేంద్ర దాస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

