Ayodhya | భక్తజన సంద్రంగా రామాలయం..త్రేతా యుగం రోజులను తలపిస్తున్న అయోధ్య : ఆచార్య సత్యేంద్ర దాస్
Ayodhya : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించిన తొలిరోజు మంగళవారం భక్తులు పోటెత్తారు. అయోధ్య నగరం శ్రీరాముడు నివసించిన నాటి రోజుల్లో త్రేతా యుగ కాలాన్ని తలపిస్తోందని శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు.
Ayodhya : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించిన తొలిరోజు మంగళవారం భక్తులు పోటెత్తారు. అయోధ్య నగరం శ్రీరాముడు నివసించిన నాటి రోజుల్లో త్రేతా యుగ కాలాన్ని తలపిస్తోందని శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు.
ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య నగరం పవిత్రతను సంతరించుకుందని, త్రేతా యుగంలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన తర్వాత నగరం శోభాయమానంగా మారిందని, ఆనాటి దృశ్యం ఇప్పుడు సాక్షాత్కరిస్తోందని పేర్కొన్నారు. ఎంతోమంది భక్తులు ప్రస్తుతం అయోధ్య తరలివస్తున్నారని, ఎటుచూసినా జై శ్రీరాం నినాదాలు మార్మోగుతున్నాయని ఇదంతా చూస్తుంటే మనం తిరిగి త్రేతా యుగం నాటి అయోధ్యకు తిరిగి వెళ్లామని అనిపిస్తోందని అన్నారు.
ఆలయ ప్రధాన ద్వారాల వద్ద భక్తుల తాకిడి చూస్తుంటే ఆలయం తెరుచుకున్న మొదటి రోజే భక్తులందరికీ దర్శనం సాధ్యం కాదని చెప్పారు. మరికొద్ది రోజులు కూడా ఆలయం వద్ద భక్తుల క్యూ ఇలాగే ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా 4000 మంది సన్యాసులు అయోధ్యకు తరలివచ్చారని, వారంతా తమతో పాటు మరో ఇద్దరు నుంచి నలుగురు వ్యక్తలను తీసుకువచ్చారని అందుకే రద్దీ అధికంగా ఉందని చెప్పారు. రాముడి దర్శనం కోసం వారెంతో ఉత్సుకతతో వేచిచూస్తున్నారని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు.
Read More :
Mizoram | మిజోరం ఎయిర్‌పోర్టులో మయన్మార్ విమానానికి ప్రమాదం.. 8 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

