Prabhas Fans | ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ సందడి: ప్రభాస్ అభిమానుల హంగామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్
Prabhas Fans |ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ మరి కొద్ది నిమిషాలలో థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. గురువారం (జనవరి 8) రాత్రి నుంచే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు మొదలవ్వడంతో డార్లింగ్ అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు.
Prabhas Fans |ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ మరి కొద్ది నిమిషాలలో థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. గురువారం (జనవరి 8) రాత్రి నుంచే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు మొదలవ్వడంతో డార్లింగ్ అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు. థియేటర్ల చుట్టూ భారీ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ప్రభాస్‌కు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.ఈ సందడిలో భాగంగా కొన్ని చోట్ల అభిమానులు చేసిన హంగామా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది.
ఓ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సైజ్ రబ్బరు మొసళ్లను చేతబట్టి హాల్ మొత్తం తిరుగుతూ సందడి చేశారు. మొదట వీడియో చూసినవారు నిజమైన మొసళ్లనే థియేటర్లోకి తీసుకువచ్చారని అనుమానించినా, అవి రబ్బరుతో చేసిన బొమ్మలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రభాస్ అభిమానుల క్రేజ్‌కు మరో ఉదాహరణగా మారింది. కొందరు దీనిని ఫన్‌గా తీసుకుంటే, మరికొందరు “ఇంతకీ వైల్డ్ సెలబ్రేషన్ అవసరమా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సెలబ్రేషన్ వెనుక కారణం కూడా ఉంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ ఓ మొసలితో ఫైట్ చేసే కీలక సన్నివేశం ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఈ సీన్‌ను చూపించడంతో అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదే కాన్సెప్ట్‌ను అభిమానులు తమ సెలబ్రేషన్లలో ప్రతిబింబించారు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్–ఫాంటసీ ఎంటర్టైనర్లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ప్రీమియర్ షోల స్పందన, అభిమానుల సందడిని చూస్తుంటే ‘ది రాజాసాబ్’ మొదటి రోజే భారీ వసూళ్ల దిశగా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలతో పాటు ప్రభాస్ అభిమానుల క్రేజ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Orey Mental Rebels….😂😂#TheRajaSaab
— cinee worldd (@Cinee_Worldd) January 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

