Headingley Test : ఉత్కంఠగా సాగుతున్న హెడింగ్లే టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ను 465కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(47 నాటౌట్), సాయి సుదర్శన్(30)లు రాణించారు. స్టోక్స్ బౌలింగ్‌లో సుదర్శన్ ఔటైన కాసేపటికే వర్షం మొదలైంది. అప్పటికి సమయం ఆరు కావడంతో అంపైర్లు స్టంప్స్‌గా ప్రకటించారు. మూడో రోజు ఆటముగిసే సరికి గిల్ సేన 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 96కు చేరింది.
భారత పేసర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్(99)రాణించడంతో భారీ స్కోర్ దిశగా పయనించిన ఇంగ్లండ్‌ను ప్రసిధ్ కృష్ణ గట్టి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత బుమ్రా తన పేస్ పవర్ చూపిస్తూ టెయిలెండర్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే పరిమితమైంది. భారత్‌కు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.