Rafael Nadal : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (Rafael Nadal) మట్టి కోర్డులో అదరగొడుతున్నాడు. ఒలింపిక్స్ పోటీలకు సన్నద్ధమవుతున్న నాదల్ బస్టాడ్ ఓపెన్ (Bastad Open) ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో స్పెయిన్ బుల్ డుజె అజ్డుకోవిక్‌ను చిత్తుగా ఓడించాడు.
అడ్జుకోవిక్ ధాటికి నాదల్ తొలి సెట్ కోల్పోయాడు. అయితే.. చాంపియన్ ఆటగాడైన అతడు ఒత్తిడికి లోనవ్వలేదు. రెండో సెట్లో పుంజుకొని.. మూడో సెట్ కూడా కైవసం చేసుకొని అడ్జుకోవిక్ ఫైనల్ ఆశలకు తెరదించాడు. తద్వారా బస్టాడ్ ఓపెన్ టోర్నీలో నాదల్ రెండేండ్ల తర్వాత తొలిసారి టైటిల్ పోరులో ఆడబోతున్నాడు.
(Comeback) King of clay 👑
19 years on, @RafaelNadal returns to the Bastad final 4-6 6-3 6-4 🆚 Ajdukovic@NordeaOpen | #NordeaOpen pic.twitter.com/UwecYzC7Oe
— ATP Tour (@atptour) July 20, 2024
క్లే కోర్టు కింగ్‌గా పేరొందిన నాదల్ పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టాడు. అయితే.. గత రెండేండ్లుగా గాయాల కారణంగా అతడు పలు టోర్నీలకు దూరమయ్యాడు. ఈ ఏడాది కూడా గాయం తిరగబెట్టడంతో తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నుంచి కూడా అర్థాంతరంగా వైదొలిగాడు. ప్రస్తుతం బస్టాడ్ ఓపెన్‌తో ఫామ్ అందుకున్న ఈ స్పెయిన్ లెజెండ్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టాడు. విశ్వ క్రీడల్లో అతడు వింబుల్డన్ విజేత కార్లోస్ అల్కరాజ్ జతగా డబుల్స్ ఆడనున్నాడు.