Rafael Nadal : టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ (Rafael Nadal) సంతోషంలో మునిగిపోయాడు. ఒకే రోజు తమ దేశానికి వింబుల్డన్ ట్రోఫీ, యూరో చాంపియన్‌షిప్ ట్రోఫీ దక్కడంతో స్పెయిన్ బుల్ సంతోషంతో పొంగిపోతున్నాడు. ‘స్పెయిన్ క్రీడా చరిత్రలో జూలై 14 అద్భుతమైన,మర్చిపోలేని రోజు’ అని నాదల్ అన్నాడు.
‘టోర్నీ ఆరంభం నుంచి స్పెయిన్ జట్టు చాలా బాగా ఆడింది. ట్రోఫీ విజయంతో యావత్ దేశం గర్వంగా ఉంది. అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ సాధించడం ఇంకా సంతోషాన్నిచ్చింది. ఇది నిజంగా మా దేశ చరిత్రలో అద్భుతమైన రోజు. ఆట అనేది ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుంది. ఇది నిజంగా మా దేశానికి చాలా మంచిది. అందులో సందేహమే లేదు’ అని నాదల్ వెల్లడించాడు.
Rafa Nadal spoke about Carlos Alcaraz’ Wimbledon win & Spain’s Euros win after doubles match with Ruud
“I think the Spanish team played amazing from the first day of the Euros to the last. The whole country is very proud. A very happy day yesterday too with Carlos winning… pic.twitter.com/Y5srG3wINk
— The Tennis Letter (@TheTennisLetter) July 15, 2024
పురుషుల సింగిల్స్‌లో టైటిల్ కొల్లగొట్టిన యువ కెరటం కార్లోస్ అల్కరాజ్పై రఫా ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి స్పెయిన్ జట్టు కప్పు కొట్టగానే ఈ టెన్నిస్ స్టార్ ఎగిరి గంతేశాడు. తొడకండరాల గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌కు దూరమైన నాదల్ ఒలింపిక్స్‌పై గురి పెట్టాడు.