Rafael Nadal : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (Rafael Nadal) అభిమానులకు శుభవార్త చెప్పాడు. గతేదాడి నవంబర్‌లో రాకెట్ వదిలేసిన రఫా రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో ( Maria Francisca Perello) ఆగస్టు 7 గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కుమారుడికి నాదల్ జంట ‘మికెల్'(Miquel) అని ముచ్చటైన పేరు పెట్టుకుంది. తమ అబ్బాయికి మికెల్ అని నామకరణం చేయడానికి పెద్ద కారణమే ఉందంటోంది న్యూ మామ్ మరియా.
యూరప్ ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. మికెల్ అనేది మరియా తండ్రి పేరు. ఆయన అనారోగ్యం కారణంగా 2023 ఏప్రిల్‌లో మరణించారు. అందుకే.. ఆయన జ్ఞాపకార్తం తమ బిడ్డకు ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు నాదల్ దంపతులు. నాదల్, మరియాలది ప్రేమ వివాహం. 2005లో రఫా సోదరి ద్వారా ఒకరికొరు పరిచయం అయ్యారు.
🚨
🇪🇸🥰 Rafael Nadal and his wife welcomed their second child – another boy – on August 7th! 👏
👶 He is named Miquel – after Mery’s father, who passed away in 2023
🗣️ https://t.co/T6nfYYSYWd
📸 Corbin via Getty Images pic.twitter.com/Jw6vP1aKms— Olly Tennis 🎾🇬🇧 (@Olly_Tennis_) August 9, 2025
దాదాపు 14 ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జోడీ.. 2019 అక్టోబర్‌లో ప్రైవేట్‌గా పెళ్లి చేసుకుంది. 2022 అక్టోబర్‌లో తమకు జన్మించిన మొదట బిడ్డకు ‘రఫెల్ జూనియర్’ అని నామకరణం చేశారు. మరియా బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదివింది. ప్రస్తుతం ఆమె తన భర్త నడిపిస్తున్న ‘రఫెల్ నాదల్ ఫౌండేషన్’కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది.
నాదల్ విషయానికొస్తే.. పురుషుల టెన్నిస్‌లో టీనేజ్ సంచలనంగా దూసుకొచ్చి దిగ్గజ ఆటగాడిగా ఎదిగాడు. ఫెదరర్‌కు సమ ఉజ్జీగా పేరొందిన స్పెయిన్ బుల్ మట్టి కోర్టు(Clay Court)లో మకుటం లేని మహారాజుగా వెలుగొందాడు. వింబుల్డన్‌లోనూ తడాఖా చూపించిన రఫా మొత్తంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళు, 92 ఏటీపీ ట్రోఫీలతో సరికొత్త చరిత్ర లిఖించాడు.