INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తడాఖా చూపించారు. డీవై పాటిల్ స్టేడియంలో వర్షం అంతరాయాల నడుమ 27 ఓవర్లకు కుదించిన పోరులో.. బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్పిన్నర్ రాధా యాదవ్ (3-30), శ్రీ చరణి(2-23)లు తిప్పేశారు. వీరిద్దరూ మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటకు తెరతీయగా.. బంగ్లాదేశ్ 119 పరుగులకే పరిమితమైంది. బంగ్లా జట్టులో షర్మీన్ అక్తర్(36) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టు ఆ దిశగా ఓ అడుగు వేసింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన డీవపై పాటిల్ మైదానంలో బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. పేసర్ రేణుకా సింగ్ తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది. ఆ తర్వాత.. రుబియా హైదర్(13), షర్మీన్ అక్తర్(36) ఆచితూచి ఆడి స్కోర్ 30 దాటించారు. అయితే.. రేణుక వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రుబియా స్లిప్‌లో షాట్ ఆడగా.. శ్రీచరణి క్యాచ్ నేలపాలు చేసింది. కానీ, ఆ తర్వాతి ఓవర్లో దీప్తి శర్మ ఔట్ చేసింది. దాంతో.. 34 వద్దే బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది.
Innings Break!
3⃣ wickets for Radha Yadav 👏
2⃣ wickets for Sree Charani 👌
1⃣ each for Renuka Singh Thakur, Deepti Sharma, and Amanjot Kaur 👍A great effort from our bowlers 🔝
Scorecard ▶ https://t.co/lkuocSlGGJ#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvBAN pic.twitter.com/1J4xFO8saI
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
కానీ, వర్షం మరోసారి అంతరాయం కలిగించేసరికి ఓపెనర్ షర్మీన్, కెప్టెన్ నిగర్ సుల్తానా(9)లు క్రీజులో ఉన్నారు. వాన కారణంగా.. ఇరుజట్లకు 27 ఓవర్లు ఆడించేందుకు సిద్ధమయ్యారు అంపైర్లు. అనంతరం ఇన్నింగ్స్ మళ్లీ ప్రారంభించిన బంగ్లాకు మెరుపు త్రోతో షాకిచ్చింది రాధా యాదవ్. పరుగుకు యత్నించిన సుల్తానాను రనౌట్ చేసింది. ఆ తర్వాత షర్మీన్ జతగా శోభన మోస్త్రే(26) దూకుడుగా ఆడింది. 21వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన శోభన ఆ తర్వాత రాధా యాదవ్ వేసిన ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి మిడాఫ్‌లో డియోల్ చేతికి చిక్కింది. షోర్నా అక్తర్ (2) ను రాధా బౌల్డ్ చేసింది.. పదద్అరుంధతి రెడ్డి డైవింగ్ చూస్తూ క్యాచ్ అందుకోగా.. ఏడో వికెట్ పడింది. చివరి ఓవర్లో రీతూ మోనీ(11) సిక్సర్ బాదడంతో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 119 రన్స్ చేయగలిగింది.