కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి కోల్‌కతాలో తొలి టెస్టు(INDvSA) ప్రారంభంకానున్నది. అయితే ఆ టెస్టు మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ద్రువ్ జురెల్ ఆడేది కన్ఫర్మ్ అయ్యింది. డొమెస్టిక్ క్రికెట్లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ బ్యాటర్‌కు ఛాన్సు ఇవ్వనున్నట్లు అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ దోసిచేట్ తెలిపారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ద్రువ్ జురెల్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 24 ఏళ్ల జురెల్ ఇప్పటి వరకు ఇండియా తరపున ఏడు టెస్టులు డాడాడు. అయితే గత అయిదు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో నాలుగు సెంచరీలు చేశాడు. ఇటీవల బెంగుళూరులో సౌతాఫ్రికా-ఏతో జరిగిన మ్యాచుల్లోనూ రెండు సెంచరీలు చేశాడు.
ప్రధాన వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్‌తో పాటు ద్రువ్ జురెల్ కూడా ఉంటాడని అసిస్టెంట్ కోచ్ టెన్ దోసిచేట్ తెలిపారు. ఇద్దరికీ ఛాన్సు ఇవ్వాలన్న క్లారిటీతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోల్‌కతా టెస్టులో ద్రువ్, రిషబ్ ఆడకుంటే ఆశ్చర్యమే అవుతుందన్నారు. ఏడాదిన్నర నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న జురెల్ .. పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. అతను ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో 140, 56, 125, 44, 132 , 127 రన్స్ స్కోరు చేశాడు. జురెల్ కేవలం ప్రధాన బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగుతాడని, పంత్ కీపింగ్ బాధ్యతలు చేపడుతాడని అసిస్టెంట్ కోచ్ చెప్పాడు.