ఆసిఫాబాద్ టౌన్, నవంబర్12 : ఢిల్లీలో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాలతో బుధవారం డాగ్, బాంబ్ స్వాడ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు, బస్టాండ్ జిల్లా దవాఖాన, కోర్టుతో పాటు, జనంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.ఎకడైనా అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే తమ సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ నిఖీల్లో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు