KNRUHS | హైదరాబాద్ : పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటా కింద 2025-26 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ వర్సిటీ బుధవారం విడుదల చేసింది. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే knrpgadmissions@gmail.comకు శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా మెయిల్ పంపాలని కోరింది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ప్రకటించింది.