ICC Player of the Month | ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్స్.. సంతోషం వ్యక్తం చేసిన కెప్టెన్ వోల్వార్డ్..!
ICC Player of the Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం అక్టోబర్ నెలకు ఉత్తమ మహిళా, మెన్స్ క్రికెటర్ల పేర్లను ప్రకటించింది. ఆసక్తికరంగా ఈ సారి రెండు అవార్డులను దక్షిణాఫ్రికా ప్లేయర్లు కైవసం చేసుకున్నారు. భారత్-శ్రీలంక వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ సాధించిన ఎల్ వోల్వార్డ్ ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది.
ICC Player of the Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం అక్టోబర్ నెలకు ఉత్తమ మహిళా, మెన్స్ క్రికెటర్ల పేర్లను ప్రకటించింది. ఆసక్తికరంగా ఈ సారి రెండు అవార్డులను దక్షిణాఫ్రికా ప్లేయర్లు కైవసం చేసుకున్నారు. భారత్-శ్రీలంక వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ సాధించిన ఎల్ వోల్వార్డ్ ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ సేనురన్ ముత్తుసామి ఐసీసీ మెన్స్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు.
వోల్వార్డ్ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఫైనల్ వరకు చేర్చింది. ఫైనల్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అక్టోబర్‌లో ఎనిమిది మ్యాచులు ఆడిన ఆమె 470 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అజేయంగా 169 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేరింది. భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. ఈ సందర్భంగా లారా వోల్వార్డ్ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా, గైర్వంగా ఉందని చెప్పింది. వరల్డ్ కప్ గెలవకపోయినా తమ పోరాటం చరిత్రలో నిలుస్తుందని పేర్కొంది. ఇక ఈ అవార్డు కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందన, ఆసిస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ పోటీపడ్డారు.
అక్టోబర్ నెలకు గాను మెన్స్ క్రికెటర్ విభాగంలో ఎడమచేతివాటం దక్షిణాఫ్రికా స్పిన్నర్ సేనురన్ ముత్తుసామి ఎంపికయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన నోమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను వెనక్కి నెట్టి ఐసీసీ అవార్డును అందుకున్నాడు. పాకిస్తాన్ పర్యటనలో ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసి ఈ అవార్డును అందుకున్నాడు. ఐసీసీ బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ముత్తుసామి 106 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

