బెంగుళూరు: న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) .. అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతను 104 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడవ రోజు భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి 345 రన్స్ చేసింది. మరో బ్యాటర్ టిమ్ సౌథీ 49 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ 299 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన రవీంద్ర .. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. ఎనిమిదో వికెట్‌కు సౌథీ, రవీంద్రలు 112 రన్స్ జోడించారు.
The team take a 299-run lead into lunch on Day 3. A second Test century for Rachin Ravindra and a 112-run partnership with Tim Southee (49*) driving the team forward in Bengaluru. Follow play LIVE in NZ on @skysportnz or @SENZ_Radio LIVE scoring | https://t.co/yADjMlJjpO 🏏 pic.twitter.com/dpYLO2nu4U
— BLACKCAPS (@BLACKCAPS) October 18, 2024
భారత సంతతి క్రికెటర్ రవీంద్రకు.. బెంగుళూరుతో లింకులు ఉన్నాయి. రవీంద్ర పూర్వీకులు బెంగుళూరు వాసులే. ఒకవైపు భారత బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేస్తున్నా.. రవీంద్ర మాత్రం తన టెక్నిక్‌తో వికెట్‌ను అడ్డుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో సరైన రీతిలో స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. టెస్టుల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. 124 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో రవీంద్ర సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో తొలి సెంచరీ కూడా బెంగుళూరులోనే బాదాడు రవీంద్ర.