IOA | న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)లో సీఈవో నియామకంపై సభ్యుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకంపై ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష మొగ్గుచూపుతుంటే..కార్యవర్గ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దీనిపై వాడీవేడీగా వాదోపవాదాలు జరిగాయి. ‘సీఈవో నియామకంపై అసోసియేషన్‌లో తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్నది. అయ్యర్‌ను సీఈవోగా ఆమోదించేది లేదంటూ కొంత మంది సభ్యులు వాదిస్తున్నారు. నియామక ప్రక్రియ కొత్త ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఐవోసీ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.భవిష్యత్‌లో మనం ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల విషయంలో అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తుంది’ అని ఉష పేర్కొంది.