BANW vs THAIW | అదరగొట్టిన రుబియా, ముర్షిదా.. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ బోణీ
BANW vs THAIW : మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్(Bangladesh) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లా రెండో మ్యాచ్‌లో గర్జించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి థాయ్‌లాండ్ (Thailand)ను చిత్తు చేసింది.
BANW vs THAIW : మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్(Bangladesh) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లా రెండో మ్యాచ్‌లో గర్జించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి థాయ్‌లాండ్ (Thailand)ను చిత్తు చేసింది. తొలుత రబియా ఖాన్(414) తిప్పేయగా.. ఆ తర్వాత ముర్షిదా ఖాటున్(50) అర్ధ శతకంతో చెలరేగింది. దాంతో, స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. రీతూ మోనీ(9 నాటౌట్) బౌండరీ బాదడంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది.
దంబుల్లా స్టేడియంలో బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. సోమవారం దంబుల్లా స్టేడియంలో థాయ్‌లాండ్‌పై అన్ని విభాగాల్లో పై చేయి సాధించి అద్భుత విక్టరీ సాధించింది. మొదట లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్(414) తిప్పేయడంతో థాయ్‌లాండ్ జట్టు 96 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్య ఛేదనను బంగ్లా ఓపెనర్లు నిదానంగా ఆరంభించారు.
Murshida Khatun batted with great composure in the run chase 🫡#WomensAsiaCup2024 #ACC #HerStory #BANWvTHAIW pic.twitter.com/q5TYKqzOK6
— AsianCricketCouncil (@ACCMedia1) July 22, 2024
దిలారా అల్కెర్(17), ముర్షిదా ఖాటున్(50)లు తొలి వికెట్‌కు రన్స్ జోడించారు. దిలారా రనౌట్ అయ్యాక ముర్షిదా థాయ్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీలతో చెలరేగింది. బౌలర్ మారినా తన జోరు తగ్గదంటూ ఎడాపెడా ఫోర్లు బాదుతూ లక్ష్యాన్ని కరిగించింది. బంగ్లా విజయానికి 10 పరుగులు అవసరం అనగా.. ఫన్నితా బౌలింగ్‌లో ముర్షిదా ఔటయ్యింది. ఆ తర్వాత రీతూ మోనీ(9 నాటౌట్), రుమనా అహ్మద్(5 నాటౌట్)లు లాంఛనం ముగించారు. స్పిన్ మ్యాజిక్‌తో థాయ్ జట్టు నడ్డివిరిచిన రబియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
రబియా ఎంట్రీతో..
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న థాయ్‌లాండ్‌కు ఓపెనర్లు శభారంభమిచ్చారు. నథాయ బుచ్చాథామ్(40) బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నది. అయితే.. లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. పవర్ ప్లే తర్వాత బంతి అందుకున్న రబియా థాయ్ బ్యాటర్ల పని పట్టింది.
Rabeya Khan’s clinical spell restricts Thailand to just 96. Will Bangladesh race to a win in the second half? 💪#WomensAsiaCup2024 #ACC #HerStory #BANWvTHAIW pic.twitter.com/glpS2W6vnk
— AsianCricketCouncil (@ACCMedia1) July 22, 2024
తొలుత ఓపెనర్ అఫిసర సువాంచోరథి(9)ని ఔట్ చేసిన రబియా.. వరుస మిడిలార్డర్‌ను కూల్చింది. అంతేకాదు ఒంటరి పోరాటం చేస్తున్న నథాయ బుచ్చాథామ్(40) బుచ్చాథామ్ను 16.5వ ఓవర్లో బౌల్డ్ చేసి థాయ్‌లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లో పడేసింది. చివర్లో సులీపార్న్ లవోమి(17), రొసెనాన్ కనోహ్(13)లు పోరాడి జట్టు స్కోర్ 90 దాటించారు.
ఇవి కూడా చదవండి
- Jagadish Reddy | రుణమాఫీపై మోసం చేస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు
- Maruti eVX | వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి మారుతి తొలి ఈవీ కారు ఈవీఎక్స్..!
- Divorce | ఇదేందయ్యా ఇదీ..! పెళ్లయిన మూడు నిమిషాలకే భర్తకు విడాకులు..! కారణం ఏమై ఉంటుందంటరూ..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

