Jagadish Reddy | రుణమాఫీపై మోసం చేస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు
Jagadish Reddy | హామీ అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నీటిని ప్రభుత్వం ఎత్తిపోయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Jagadish Reddy | హామీ అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నీటిని ప్రభుత్వం ఎత్తిపోయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సుల సంఖ్యను కుదించారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. విద్యుత్ అధికారులపై నెపం పెట్టి కరెంటు కోతల నుంచి తప్పించుకోవాలని చిల్లర ప్రయత్నాలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ ఓ జోక్‌లా కనిపిస్తుందని.. మాఫీ వివరాలపై స్పష్టత లేదన్నారు. అన్నదాతలు ఆందోళన పడుతున్నారని.. రుణమాఫీపై వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారన్నారు.
రుణమాఫీపై మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకువడం లేదని మండిపడ్డారు. వ్యవసాయం, సాగునీరుపై సీఎం సహా ఎవ్వరికీ అవగాహన లేదని.. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తి పోయడంలేదని నిలదీశారు. కాళేశ్వరం కాల్వలకు నీటిని ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని.. కాళేశ్వరం కొట్టుకుపోతది అని దుష్ప్రచారం చేశారని.. సాగుకు సిద్ధమైన రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. యాసంగిలా ఈ సారి కూడా పంటలను ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గోదావరి ఆయకట్టుకు నీళ్లందించేందుకు అవకాశం ఉన్నా రైతులపై కక్ష్యపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. గోదావరి నీరు వృథౠగా పోనీయకుండా తక్షణమే సాగు, తాగు నీరు అందించాలని సర్కారును డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

