Maruti eVX | వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి మారుతి తొలి ఈవీ కారు ఈవీఎక్స్..!
Maruti eVX | వచ్చే ఏడాది ప్రారంభంలో మారుతి సుజుకి తన తొలి పూర్తిస్థాయి ఈవీ కారు ‘మారుతి ఈవీఎక్స్’ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Maruti eVX | పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే మధ్య తరగతి వర్గాల ప్రజలు కార్లలో ప్రయణించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ మోడల్ కార్లతోపాటు ఈవీ, హైబ్రీడ్ టెక్నాలజీ కార్ల తయారీ వైపు పయనించేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్. భారత్ మార్కెట్లో తన పట్టును కాపాడుకుంటూనే క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ఈవీల వైపు తమ అన్ని మోడల్ కార్లను మళ్లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలిసారి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం ‘ఈవీఎక్స్ (eVX)’ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. మరోవైపు హైబ్రీడ్ టెక్నాలజీ బేస్డ్ కార్లపైనా ఫోకస్ చేస్తున్నది.
జపాన్ తర్వాత మూడు కోట్ల కార్ల తయారీ మైలురాయిని దాటిన భారత్ మార్కెట్.. సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చాలా కీలకం. 1983 నాటి పరిస్థితులను బేరీజు వేసుకున్న మారుతి సుజుకి.. తన సేల్స్ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నది. ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి పోటీ ఎదురవుతున్నా హైబ్రీడ్ టెక్నాలజీలతో మార్కెట్లో తన వాటాను కాపాడుకునేందుకు మారుతి సుజుకికి అవకాశాలు పుష్కలం. భారత్ మార్కెట్లో తమ స్థానాన్ని తిరిగి పొందడం సాధ్యమేనని సుజుకి మోటార్ కార్పొరేసన్ ఉపాధ్యక్షుడు కెనిచి అయుకవా చెప్పారు. మధ్య, దీర్ఘకాలికంగా తమ మార్కెట్ విస్తరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త కార్లను అభివృద్ధి చేయడంతోపాటు పెట్టుబడులతోపాటు నెట్ వర్క్ విస్తరిస్తామని బ్లూంబర్గ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బ్రెజా వంటి పాపులర్ మోడల్ కార్లతో విశ్వాసాన్ని సంపాదించుకున్న మారుతి సుజుకి.. ఈవీ కార్లు ఆహ్వానించదగ్గ పరిణామం అని చెబుతున్నది. త్వరలో ఆవిష్కరించనున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ (Maruti Suzuki eVX) ఈవీ కారుతో ఈవీ మార్కెట్ పట్ల తమ సీరియస్ నెస్ ను బయట పెట్టనున్నది. భారత్ ఈవీ మార్కెట్ చిన్నదైనా మున్ముందు పుష్కలమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయిన భావిస్తున్నది మారుతి సుజుకి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

