ICC : సుదీర్ఘ ఫార్మాట్లో చెలరేగిన ముగ్గురు క్రికెటర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) రేసులో నిలిచారు. అక్టోబర్ నెలకుగానూ పురుషుల విభాగంలో ఏకంగా ముగ్గురికి ముగ్గురూ బౌలర్లే నామినేట్ అయ్యారు. దక్షిణాఫ్రికా పేస్ పేసర్ కగిసో రబడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్, పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీలు ఈసారి ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో నిలిచారు.
ఇక మహిళల విభాగంలో టీ20 వరల్డ్ కప్‌లో మెరిసిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్, లారా వొల్వార్డ్త్(దక్షిణాఫ్రికా కెప్టెన్), డియాండ్ర డాటిన్(వెస్టిండీస్)లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకోసం పోటీ పడుతున్నారు. ఓటింగ్ ఆధారంగా ఐసీసీ వీళ్లలో ఒకరిని విజేతగా ప్రకటించనుంది.
🔸 New Zealand’s Women’s #T20WorldCup talisman 🎖
🔸 South Africa’s inspirational opener and leader 🫡
🔸 West Indies’ impactful all-rounder 👊The three nominees for the ICC Women’s Player of the Month for October 2024 ➡ https://t.co/IU96xV99e2 pic.twitter.com/Nd6335Ny2G
— ICC (@ICC) November 5, 2024
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రబడ నిప్పులు చెరిగాడు. సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాంసించాడు. దాంతో, అక్టోబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బరిలో నిలిచాడు.భారత పర్యటనలో న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయంలో ముఖ్య భూమిక పోషించిన మిచెల్ శాంట్నర్‌ను నామినేషన్ దక్కింది.
A South Africa pace sensation and two skilled left-arm spinners are the ICC Men’s Player of the Month nominees for October 2024 👏
More ➡ https://t.co/pync1VrZCk pic.twitter.com/e4Jt5oCepO
— ICC (@ICC) November 5, 2024
బెంగళూరు, పుణే టెస్టులో టీమిండియా బ్యాటర్లను బెంబేలెత్తించిన శాంట్నర్ 13/157తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నొమన్ అలీ తిప్పేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను వణికిస్తూ వికెట్ల వేటతో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. రెండు టెస్టుల్లో అలీ 11/147, 9/130తో అదరహో అనిపించాడు.