IPL 2024 RCB vs PBKS | కెప్టెన్, గ్రీన్ దొరికిపోయారు.. బౌండరీలతో హోరెత్తిస్తున్న కోహ్లీ
IPL 2024 RCB vs PBKS పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన పరుగుల ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) రెండో వికెట్ పడింది. రబాడ తన రెండో ఓవర్లో ఓవర్లో డేంజరస్ కామెరూన్ గ్రీన్(3)ను ఔట్ చేశాడు మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ...
IPL 2024 RCB vs PBKS పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన పరుగుల ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) రెండో వికెట్ పడింది. రబాడ తన రెండో ఓవర్లో ఓవర్లో డేంజరస్ కామెరూన్ గ్రీన్(3)ను ఔట్ చేశాడు మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ(35) బౌండరీల మీద బౌండరీలు బాదేస్తున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో అతడు ఏకంగా మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో, ఆర్సీబీ స్కోర్ 6 ఓవర్లకే 50 దాటింది. రజత్ పాటిదార్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లేలో స్కోర్.. 50/2.
అంతకుముందు సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ(33) కొద్దిలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. స్లిప్‌లో బెయిర్‌స్టో క్యాచ్ జారవిడిచాడు. ఆ తర్వాత విరాట్ వరుసగా మూడు బౌండరీలతో చెలరేగాడు. ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచి 16 పరుగులు రాబట్టాడు. రబాడ వేసిన ఫుల్‌లెంగ్త్ బంతికి కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(3) సామ్ కరన్ చేతికి చిక్కాడు. దాంతో, 26 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది.
A fine start to the chase for @RCBTweets!
2 wickets inside the powerplay for @PunjabKingsIPL as #RCB move to 50/2
Follow the Match ▶️ https://t.co/cmauIj3e0o#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/TZSfhOWWXs
— IndianPremierLeague (@IPL) March 25, 2024
ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 176 పరుగులు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ధాటికి భారీ స్కోర్ కొట్టలేకపోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్(45), జితేశ్ శర్మ(27), సామ్ కరన్(23) లు బ్యాట్ ఝులిపించారు. ఆఖరి ఓవర్లో శశాంక్ సింగ్(20 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టగా జోసెఫ్ ఒక వికెట్ తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

