Nirmal Sheoran : భారత అథ్లెట్ నిర్మలా షోరాన్(Nirmal Sheoran)కు పెద్ద షాక్ తగిలింది. నిరుడు డోప్ పరీక్ష (Dope Test)లో పట్డుబడినందుకు జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) ఆమెపై 8 ఏండ్ల నిషేధం విధించింది. గత ఏడాది డోప్ పరీక్షలకు హాజరైన నిర్మల నిషేధిత డ్రగ్ తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆమె రక్త నమూనాను పరీక్షించగా అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్(Anabolic Androjenic Steroids)తో పాటు టెస్టోస్టిరాన్(Testosteron) పాజిటివ్ వచ్చింది.
దాంతో నాడాకు చెందిన క్రమశిక్షణ కమిటీ అథ్లెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే నిర్మలపై ఏకంగా 8 ఏండ్ల నిషేధం విధించింది. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2013 వరకు నిర్మలపై సస్పెన్షన్ కొనసాగుతుందని నాడా తెలిపింది.
నిర్మలా షోరాన్
400 మీటర్ల పరుగులో పోటీపడే నిర్మల సస్పెన్షన్‌కు గురికావడం మొదటిసారి కాదు. 2018లో కూడా ఆమె డోప్ పరీక్షలో దొరికిపోయింది. నిషేధం ముగిశాక ఆ ఏడాది భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ, అంతరాష్ట్ర చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. 2016లో హైదరాబాద్‌లో జరిగిన 56వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్లొంది. 51.48 సెకన్ల టైమింగ్‌తో రేసు పూర్తి చేసి, 2016 రియో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకుంది.