Pakistan | పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. పలు చోట్ల రీపోలింగ్
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ జరిగిన జాతీయ జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ (Pakistan) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో మరోసారి సకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ జరిగిన జాతీయ జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ (Pakistan) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో మరోసారి సకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. అయితే ఎన్నికల సందర్భంగా పలు బుతుల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు అధికమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐతోపాటు పలు పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. దీంతో పాక్ ఎన్నికల సంఘం రీపోలింగ్ (Repolling) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 15న దేశవ్యాప్తంగా 40 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించనుంది.
ఈనెల 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో ఫలితాలు వెలువడలేదు. ఇప్పటికీ మరో ఏడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే కౌంటింగ్ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
266 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇప్పటివరకు 259 సీట్లలో ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (PTI) మద్దతుదారులు 102 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవాలంటే మరో 31 చోట్ల గెలుపొందాల్సి ఉంది. కాగా, 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

