PV Sindhu | సింగపూర్ ఓపెన్ సింధు సొంతం
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సింగపూర్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నది. సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీపై
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సింగపూర్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నది. సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ యీపై 21-9, 11-21, 21-15 తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారిగా సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను దక్కించుకున్నది. ఈఏడాది సింధుకు ఇది మూడో టైటిల్. ఇప్పటికే కొరియన్ ఓపెన్, స్విస్ ఓపెన్లలో గెలుపొందింది. కాగా, టోర్నీ ప్రారంభం నుంచి మెరుగైన ఆటతీరుతో దూసుకెళ్తున్న సింధు.. ఫైనల్లో మ్యాచ్ ప్రారంభమైన 12 నిమిషాల్లోనే తొలి రౌంట్ను ముంగించేసింది.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022
ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం చేజిక్కించుకున్న తెలుగమ్మాయి.. ఒక్క సూపర్-500 టైటిల్ కూడా పట్టలేకపోయింది. దీంతో సింగపూర్ ఓపెన్లో విజయం సాధించి ఆ లోటును తీర్చుకున్నది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్లో విజేతగా నిలిచినప్పటికీ.. అవి రెండు సూపర్-300 టోర్నీలు కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

