సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 22-20, 21-12తో భారత్‌కే చెందిన ఇష్రాని బరుహపై అలవోక విజయం సాధించింది.
మరో సింగిల్స్‌లో యువ సంచలనం తన్వీ 21-13, 21-15తో మాళవిక బన్సోద్(భారత్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌లో హరిహరణ్ -అర్జున్ ద్వయం 21-17, 21-17తో మైఖేల్ ఒవెన్- సోడెసా (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్ బెర్తు దక్కించుకోగా.. మిక్స్‌డ్‌లో మనీషా-ధ్రువ్ రావత్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది.