క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సింధుతో పాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది.
- ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
మనీలా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సింధుతో పాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21-16, 21-16తో జాస్లిన్ పై విజయం సాధించింది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు అదరగొట్టింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-17, 21-15తో అకీరా కొగా- తైచీ సైటో ద్వయంపై గెలుపొందింది. తదుపరి రౌండ్లో మూడో సీడ్ హే బింగ్ జియావోతో సింధు.. మలేషియా జోడీతో సాత్విక్ జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు మూడు పతకాలు నెగ్గిన సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లో 21-12, 7-21, 13-21తో వాంగ్ జీ హీ చేతిలో ఓడగా.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 16-21, 21-17, 17-21తో వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

