కౌలాలంపూర్: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu).. మలేషియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచి గాయం వల్ల రిటైర్ అయ్యింది. దీంతో పీవీ సింధు ఎటువంటి ప్రతిఘటన లేకుండానే సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన యమగుచిపై తొలి గేమ్‌లో 21-11 తేడాతో పీవీ సింధు విక్టరీ కొట్టింది. అయితే మోకాలి బెల్ట్ పెట్టుకుని గేమ్ ఆడిన జపాన్ ప్లేయర్ తొలి గేమ్ ఓడిన తర్వాత మ్యాచ్ నుంచి తప్పుకున్నది. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 18వ స్థానంలోఉన్న సింధు..గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి టోర్నమెంట్ ఆడుతున్నది.
Queen PV storms into the semis of #MalaysiaOpen 🤩 pic.twitter.com/2S8d0KUcMq
— BAI Media (@BAI_Media) January 9, 2026