కౌలాలంపూర్ : కాలి గాయం నుంచి కోలుకుని తొలి టోర్నీ ఆడుతున్న పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ మలేషియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు.. ప్రపంచ చాంపియన్, జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై గెలిచి లాస్ట్-4కు అర్హత సాధించింది.
క్వార్టర్స్ పోరులో భాగంగా సింధు తొలి గేమ్‌ను 21-11తో గెలుచుకున్న తర్వాత రెండో గేమ్‌లో జపాన్ అమ్మాయి మోకాలి నొప్పి బాధపడుతూ ఆట నుంచి తప్పుకుంది. కాగా పురుషుల డబుల్స్‌లోనూ భారత పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో స్టార్ షట్ల ద్వయం సాత్విక్, చిరాగ్ 10-21, 21-23తో ఆరో సీడ్ ఇండోనేషియా జోడీ అల్ఫియన్, షోహిబుల్ ఓటమిపాలయ్యారు.