కుమమొటొ: జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు.. 21-12, 21-8తో బుసానన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది.
ఇక లక్ష్యసేన్.. 22-20, 17-21, 16-21తో లియోంగ్ జున్ హావొ(మలేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్ నెగ్గినా సేన్ తర్వాత ఆటపై పట్టు కోల్పోయాడు.