Badminton | లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, అయూశ్, లువాంగ్, రజావత్, రిత్విక్ ఈ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో 18వ ర్యాంకర్ సింధు 21-10, 12-21, 21-15తో భారత్‌కే చెందిన ఇరా శర్మపై పోరాడి గెలిచింది.
మరో పోరులో 17 ఏండ్ల యువ సంచలనం ఉన్నతి 21-18, 22-20తో చోయికీవాంగ్ ను ఓడించింది. మాళవిక బన్సోద్, అనుపమ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-14, 21-13తో డానిల్పై అలవోకగా గెలిచాడు. రజావత్ 21-15, 21-8తో లి డుక్ ఫట్పై గెలిచాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ – గాయత్రి గోపీచంద్ ద్వయం 21-13, 21-10తో అశ్విని-శిఖాను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి-సిక్కిరెడ్డి జంట.. 18-21, 12-21తో లూ బింగ్ – హో లొ చేతిలో పరాభవం పాలైంది.