ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న ఏకైక షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు.. 18-21, 21-12, 21-16తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హాన్ యు (చైనా)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.
తొలి గేమ్‌లో హోరాహోరి పోరాడినా తృటిలో ఆ గేమ్‌ను చేజార్చుకున్న సింధు.. రెండో గేమ్ నుంచి జూలు విదిల్చింది. గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ పోరులోని నిర్ణయాత్మక మూడో గేమ్ ఒకదశలో సింధు 8-11తో వెనుకబడ్డా అనూహ్యంగా పుంజుకుని గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.