కౌలాలంపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. సీనియర్ షట్లర్ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-9, 21-12తో రికో గ్వాంజి(జపాన్)పై అలవోక విజయం సాధించింది. కేవలం 37 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకున్న సింధు..ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుని క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ అన్ సె యంగ్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి షట్లర్ కునాల్వత్ విదిత్సరణ్ రిటైర్డ్ కావడంతో లక్ష్యసేన్‌కు వాకోవర్ లభించింది.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-15, 11-21, 21-18తో లీ జీ హుయి, యాంగ్ పో సువాన్ ద్వయం(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. మూడు గేమ్‌ల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్న నాలుగో సీడ్ సాత్విక్, చిరాగ్ జంటకు రెండో గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పుంజుకున్న భారత జోడీ 21-18తో మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తనీశా కాస్ట్రో జోడీ 8-21, 21-17, 21-16తో జపాన్ ద్వయం యుట వతనబె, మాయా తగుచిపై గెలిచి ముందంజ వేసింది.